హైదరాబాద్ : ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో పత్రికా కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని తేల్చేశారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుంతుందని తెలిపారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు.
