అల్లూరు జిల్లా హుకుంపేట:రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని నాలుగు కిలోమీటర్ల వరకు డోలి మోతతో తీసుకొచ్చన సంఘటన మండలంలోని గత్తుం పంచాయతీ గాలిపాడు గ్రామంలో ఈ ఆదివారం చోటుచేసుకుంది.గాలిపాడు గ్రామనికి చెందిన జాన్ని కొండమ్మ ఆదివారం పురిటి నొప్పులు కొసం పడరాని పాటలు పాడుతూ ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముందుగా అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేయగా గాలిపాడు గ్రామం వరకు రాదు గత్తుం గ్రామ పంచాయతీ కి రావాలని వారు సూచించడంతో అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో నడిచే వెళ్లేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది.దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆమె భర్త నలుగురు వ్యక్తులను సాయంతో రెండు కర్రలకు దుప్పటి కట్టి డోలిమొత్తలో గాలిపాడు గ్రామం నుంచి గత్తుం గ్రామ పంచాయతీ వరకు నాలుగు కిలోమీటర్లు ఏకదటిగా కాలిబాటలో నడుచుకుంటూ పురిటి నొప్పులతో ఉన్న నిండు గర్భిణీ స్త్రీని మోసుకొచ్చారు. రహదారి సౌకర్యం లేక పోవడంతో 4లో మీటర్లు వరకు నిండు గర్భిణీ స్త్రీని డోలి మోత అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు.దీంతో 108 వాహనాంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్న ప్రస్తుతం ఆరాగ్యం బాగానే వుంది అని వైద్యు తెలిపారు.