తెలుగు పాత్రికేయ రంగానికి కొత్త ఒరవడి దిద్దిన అక్షర యోధుడు రామోజీరావు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్, జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ స్పందించారు.
తెలుగు ప్రజల జీవితాల్లో రామోజీ ఒక విడదీయలేని భాగం అని అభివర్ణించారు. “ఈనాడు గ్రూప్, ఈటీవీ నెట్‌వర్క్, ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు, కమ్యూనికేషన్ ప్రపంచానికి ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఆయన ఓ దార్శనికుడు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన సిసలైన యోధుడు రామోజీరావు అని కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.