- రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం.. జనసేన నేతలు వెల్లడి..
తిరుపతి :రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసేన పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేదిశగా కృషి చేస్తూ, నేడు రాష్ట్ర పాలక (వైసిపి) కుట్రను బగ్నం చేసి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పవన్ కళ్యాణ్ పోరాటంతోనే కాపాడుకున్నామని, జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. శుక్రవారం తిరుపతిలో ఆయన.., జనసేన నేతలు రాజారెడ్డి, బాబ్జి, ముక్కు సత్యవంతుడు, హేమ కుమార్, సుమన్ బాబు, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, కిషోర్, హేమంత్, వినోద్ రాయల్, తదితరులతో కలిసి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు ఢిల్లీ అధిష్టానంతో చర్చలు జరిపి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించిన విషయాన్ని కిరణ్ రాయల్ గుర్తు చేసారు. విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మాలనుకునే సీఎం జగన్ రాజకీయ కుతంత్రాలను ఈ సందర్భంగా ఎండగట్టారు.