పల్నాడు జిల్లా : సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్సప్రెస్ రైలు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో 5 నిమిషాల స్టాప్ ఇవ్వాలని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్ కోరారారు. అయన మాట్లాడుతూ సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే భక్తుల కొరకు త్వరలో కొత్తగా ప్రవేశపెట్టనున్న వందే భారత్ ఎక్సప్రెస్ రైలు 9వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది అని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ రైలు నల్గొండ గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8న సికింద్రాబాద్ స్టేషన్ లో ఈ రైలును ప్రారంభించు చున్నారు. కావున కేంద్ర ప్రభుత్వం వారికీ , రైల్వే అధికారులకు నా విన్నపం ఏమనగా కొత్తగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లాకు పిడుగురాళ్ల పట్నంలో 5 నిమిషాల స్టాప్ ను కల్పించినట్లయితే .. పుణ్యస్థలం తిరుమలకు వెళ్లడానికి జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే పల్నాడు జిల్లా వైఎస్ఆర్సిపి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు ఆలోచించి వెనుకబడిన పల్నాడు జిల్లాను దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులకు వినతి పత్రాన్ని ఇవ్వాలని కోరారు. పల్నాడు జిల్లా ప్రజల యొక్క విన్నపమును దృష్టిలో పెట్టుకొని పిడుగురాళ్ల పట్టణంలో వందే భారత్ రైలు స్టాప్ కొరకు కృషి చేయాలని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ సభ్యులు వంగవరపు శ్యాం ప్రసాద్ కోరారు .