- ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యజమానియాల దిష్టిబొమ్మ దగ్ధం
నాగర్ కర్నూల్ జిల్లా:నాగర్ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తా లో ప్రైవేట్ కార్పొరేట్ యజమానుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు,ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో టెస్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫార్మ్స్ టై బెల్టు అని రకరకాల పేర్లతో పేద విద్యార్థులు అయినటువంటి తల్లిదండ్రుల దగ్గర వేలాది రూపాయలు వసూలు చేస్తూ టెస్ట్ బుక్స్ గాని నోట్ బుక్స్ గాని ఉన్నటువంటి ధరలకంటే రెండంతలుగా వసూలు చేస్తూ చదువు చెప్పాల్సినటువంటి పాఠశాలల్లో వీళ్ళ స్కూల్లో పేర్లతో టెస్ట్ బుక్స్ ను అమ్ముతున్నారు. అంతేకాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వారి ముక్కులు పిండి లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నారు పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా ఇరుకు ఇరుకు తరగతి గదులలో కూర్చోపెట్టి ఆట స్థలం గాని మూత్రశాలలు గాని వెలుతురు లేనటువంటి తరగతి గదులలో విద్యార్థులకు చదువు బోధిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు పర్మిషన్లు లేకుండా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ తమ ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. దీనిపై అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కూడా వారు పట్టించుకోకుండా మాటలకే పరిమితమయ్యారు, తప్ప అధికారికంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి మన జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో చేస్తున్నటువంటి దోపిడిని అడ్డుకట్ట వేసి పేద విద్యార్థులు అయినటువంటి తల్లిదండ్రులకు భారం మోపకుండా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాము. లేనిచో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష కార్యాచరణలకు సిద్ధమవుతావని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మధు గౌడ్, ఉపాధ్యక్షులు జి నరేష్,అధ్యక్షులు స్టీఫెన్, సోమశేఖర్, అరవింద్, మల్లికార్జున్, మధు,లక్ష్మణ్, లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.