- ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో వివాహిత మహిళ, ఆరుగురు పిల్లల అదృశ్యం
- కేసును 24 గంటల్లోపే చేధించిన పోలీసులు
- జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు
- యాగంటి, మహానంది, అహోబిలం తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు
- అహోబిలం లో గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
- జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారికి, పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం
కడప జిల్లా : ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలోని మోడంపల్లికి చెందిన వివాహిత, ఆరుగురు చిన్నారుల అదృశ్యం కేసును 24 గంటల్లోనే ఛేదించి శభాష్…పోలీస్ అంటూ ప్రజల మన్ననలందుకున్నారు ప్రొద్దుటూరు పోలీసులు. వివరాల్లోకెళితే….ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలోని మోడంపల్లికి చెందిన దొరసానిపల్లి వెంకట సుబ్బమ్మ (32), కుటుంబ కలహాలతో తన పిల్లలైన ఆశ్రీత (11), అజయ్(9), అనూష(7), కళ్యాణి (5), లావణ్య(4), బద్రి (2) లతో 30 న గురువారం ఇంటినుండి వెళ్లిపోయినట్లు వెంకటసుబ్బమ్మ తల్లి నారాయణమ్మ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు టూ టౌన్ సి.ఐ జి.ఇబ్రహీం ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను తక్షణం రంగంలోకి దించారు. యాగంటి, మహానంది, అహోబిలం తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం అహోబిలంలోని ఓ ఆశ్రమంలో ఉన్నట్లు గుర్తించి వారిని సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. అదృశ్యమైన మహిళతో పాటు ఆరుగురు చిన్నారులను క్షేమంగా తమకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారికి, పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మిస్సింగ్ కేసును చేధించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ప్రత్యేకంగా అభినందించారు.