గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులైన మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించేరదుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు హౌంశాఖ కూడా ప్రతిపాదనలు సిద్ధంచేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పదోన్నతులు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు మాత్రమే ఉండనున్నాయి. మహిళా పోలీసులకు సీనియర్ మహిళ పోలీస్‌గా తొలుత పదోన్నతి కల్పిస్తారు. ఈ పదోన్నతికి కనీసం ఆరేళ్లపాటు వారు మహిళా పోలీస్‌గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే మహిళా పోలీసుగా నియమితులైన సమయంలో నిర్వహిరచిన పరీక్షల్లో వారు సంపాదించుకున్న మార్కులు, విధి నిర్వహణ సమయంలో వారి పర్ఫార్మెన్స్ వంటి వాటని కూడా పరిగణలోకి తీసుకుంటారు. సీనియర్ మహిళ పోలీస్ వరకు వారు ఎస్‌ఐ పరిధిలోనే ఉరటారు. ఆ తరువాత ఎఎస్‌ఐగా మదోన్నతి పొంది ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే తదుపరి పదోన్నతి అయిన ఎస్సై స్థాయిలో డిఎస్‌పి కార్యాలయంలోనూ, ఇన్‌స్పెక్టర్ పదో న్నతితో జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ పనిచేయాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. అన్ని స్థాయిల్లో నూ వారంతా ఆర్గనైజింగ్ విధుల్లో మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని ఆ ప్రతిపాదనల్లో పొందుపరిచారు. ఇదే సమయంలో మహిళ పోలీస్‌కు సంబంధించిన జాబ్ ఛార్ట్‌ను కూడా పూర్తి స్థాయిలో తయారుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.