ఆక్టోపస్ మాఫీయా అరికట్టాలి సిట్ సిఐడి కాలయాపన తగదు!! విశాఖ తరహాలో.. సిబిఐ దర్యాప్తు చేపట్టాలి .. కాకినాడ పోర్టు ప్రగతి ప్రతిష్ట పునరుద్దరించాలి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ పోర్టుకు ఏర్పడిన అపప్రదపై సిట్ సిఐడి దర్యాప్తు ల వలన కంటితుడుపు కాల యాపన తప్ప గత అనుభవాల రీత్యా ఎటువంటి ఫలితాలు ఉండవని సి బి ఐ దర్యాప్తు చేపడితేనే దేశ వ్యాప్తంగాపలు పోర్టుల్లో ఆక్టోపస్ గా తయారైన అగ్రరాజకీయ నాయకుల ఉన్నతాధికారుల మిల్లర్ల ఎక్స్ పోర్టర్ల నడుమ గుట్టుగా కొనసాగుతున్న అవినీతి అక్రమాల కార్యకలాపాలు బయట పడతాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. అగ్ర నాయకుల మధ్య ఆధిపత్య కమీషన్ల లాలూచీ వ్యవహారాలు ఒకరి ప్రయోజనాలు మరొకరు దెబ్బతీయడం వంటి పరిణామాలు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడిందని రాజకీయ విషప్రచారం కాగా సిబిఐ దర్యాప్తులో డ్రగ్స్ కాదని త్వరితంగా తేల్చడంతో విశాఖ పోర్టు పరిరక్షణ కాబడిందన్నారు. అదే తీరుగా కాకినాడ పోర్టు పై గడచిన రెండు సంవత్సరాల నుండి డ్రగ్స్ ఎగుమతి అంటూ కార్పోరేషన్ చెత్త వాహ నాలను వాహనాల సర్వీస్ కేంద్రాలను ఇందుకు వాడుతున్నా రని ఎన్నికల ముందు తీవ్ర ప్రచారం జరిగింద న్నారు. పోర్టు లో ఎగుమతులు దిగుమతులపై కస్టమ్స్ డెరైక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నప్పటికీ అక్రమాల దందా వుందని నిర్ణీత గడువు లేకుండా ప్రతి 15 రోజులకు నివేదిక పేరిట కాలయాపన చేసే బదులు నిర్ధిష్టంగా సిబిఐ దర్యాప్తు కోరితేనే కాకినాడ పోర్టు ప్రతిష్ట ప్రగతి పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంటుందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కాకినాడ పోర్టు పరిరక్షణ గురించి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో విశాఖ భూముల కుంభకోణం అమరావతి రాజధానిలో భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ పై వేసిన సిట్ దర్యాప్తులు ఎటువంటి ముగింపు లేకుండా కనుమరుగైన దృష్టాంతాలున్నాయ న్నారు. సి బి ఐ దర్యాప్తు జరిగితేనే దేశ వ్యాప్తంగా ఆక్టోపస్ మాదిరి వ్యవస్థీకృత మైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందా ముగిసే అవకాశం ఏర్పడుతుం దని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టును మాత్రమే విపరీత ఆరోపణలతో బదనామ్ చేయడం వలన నగర అభివృద్ధి జీవనోపాధి దెబ్బతింటున్నదన్నారు.దేశప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకోవాల్సిన అతిముఖ్యాంశంగా పేర్కొన్నారు.