పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గ ఉద్యోగుల సంక్షేమ సంఘం గత వారం రోజులుగా పెరిగిన చలిగాలుల ప్రభావం వల్ల అల్లాడిపోతున్న యాచకులకు రోడ్లమీరుపక్కల నిద్రిస్తున్న అభాగ్యులకు దుప్పట్లు పంచి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం మా బాధ్యత అను నినాదంతో పీసేవ బృందం సుమారు 30 మందితో వందకు పైగా దుప్పట్లను తీసుకువెళ్లి అర్ధరాత్రి 11 గంటల తర్వాత వారికి అందజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పరిధిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించడానికి తాము ముందు ఉంటామని సంకేతాలు అందజేశారు. ఈ నియోజకవర్గ స్థానిక ఉద్యోగులకు పలు శాఖాపరమైన ఏ సమస్య వచ్చినా వాటిని పాలకులు మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడంలో విజయవంతంగా ముందుకు సాగుతుందని, ఇప్పుడు పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదంతో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించడంలో మేము ముందు ఉంటామని తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో మొదటిగా ఈ కార్యక్రమాన్ని పిఠాపురం పట్టణంలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్న కారణం చేత ప్రారంభించామని మరియు పిఠాపురం మండలంలోని ఇతర గ్రామాలు అయిన గొల్లప్రోలు మరియు ఉప్పాడ మండలాలకు విస్తరిస్తామని ఫౌండర్ ప్రెసిడెంట్ చామంతి నాగేశ్వరరావు తెలిపారు. పలువురు ప్రముఖులు వీరు చేసిన కార్యక్రమాన్ని అభినందించారు.
