- నిండు మనసుతో ఆశీర్వదించండి..!!
- అభివృద్ధికి అర్థం చెపుతాను..!!
- పేరూరు సమస్యలపై ప్రత్యేక దృష్టి…
- 29వ రోజు “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” కార్యక్రమంలో “పులివర్తి నాని”
తిరుపతి, మే-20: చంద్రగిరి నియోజకవర్గ దశ దిశను మార్చే బాధ్యతను తాను తీసుకుంటాననీ చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వాదించాలని కోరారు.
తిరుపతి రూరల్ మండలం, పేరూరు పంచాయితీలో చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్, చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు పులివర్తి నాని గారు చేపట్టిన “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” 29వ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు పులివర్తి నానికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. పులివర్తి నాని సమస్యలు సేకరిస్తూ భరోసా కల్పిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే చంద్రగిరి సర్వ నాశనమవుతుందన్నారు. చంద్రగిరి భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలనన్నా నారా చంద్రబాబు నాయుడు ను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం చారిత్రాత్మక అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. అలాగే చంద్రగిరిలో కూడా తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు మంచి విజన్ కలిగిన నాయకుడన్నారని కొనియాడారు. హైదరాబాద్ అభివృద్ధి వెనక చంద్రబాబు కృషిని గుర్తు చేశారు.
క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటి చేయనున్నానని అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధికి అర్థం చెపుతానన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీని ఇంటిముఖం పట్టించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదన్న ఆయన తాయిళాలతో ఓట్లు కోసం వెళితే ప్రజలు తరిమి తరిమి కొడతారని స్పష్టం చేశారు.
పేరూరు సమస్యలపై ప్రత్యేక దృష్టి….
పేరూరు పంచాయితీలో పలు సమస్యలు తిష్ట వేశాయని పులివర్తి నాని అన్నారు. ఇంద్రసేనా నగర్ (హరిజనవాడ), బృందావంన కాలనీ, ఎన్టీఆర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు నాని దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కాలనీలో విద్యుత్ మీటర్లకు అనుమతి ఇవ్వడంలేదని, రోడ్లు సమస్యలను గ్రామస్తులు నాని దృష్టికి తీసుకొచ్చారు. పేరూరు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని నాని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు పసుపులేటి రాజా, జనరల్ సెక్రెటరీ వెంకటేష్, నటరాజ, లక్ష్మి ప్రసన్న, ముని హేమంత్ రెడ్డి, వేణు గోపాల్ నాయుడు, రంగనాథ్, అనిల్ కుమార్ రాయల్, ముంతాజ్, మహేష్, డామినేటి నాగరాజు, మురళి, హర్ష, రవి, శంకర, సాగర్, మాజీ సర్పంచ్ గుణవతి, వెంకటేష్, మంజునాథ్, శంకర, సుబ్రమణ్యం,అమర్, చలపతి, పృథ్వి, శేఖర్, కవి, దేవ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.