- ద్వారకా నగర్ లో కోట్లు విలువైన భూమి కబ్జా…
- 32వ రోజు మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో “పులివర్తి నాని”
తిరుపతి, మే-24: వైసీపీ పాలనలో చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి 20 సంవత్సరాలు వెనుకబడిపోయిందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలం, పేరూరు పంచాయితీ, హరిపురం కాలనీలో “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” 32వ రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. యువత గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అడుగడుగునా ప్రజలు పులివర్తి నాని గారికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. పులివర్తి నాని గారు సమస్యలు సేకరిస్తూ భరోసా కల్పిస్తూ ముందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒక్క అవకాశం…
9ఏళ్లు అరాచక శక్తుల పాలనలో నియోజకవర్గంలోని సహజ సంపదను ఏవిధంగా దోచుకుంటున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. ఇసుక, మట్టి, గంజాయి, ఎర్రచందనం, భూ కబ్జాలు పెరిగిపోయారని ఆరోపించారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తారని పులివర్తి నాని ధీమా వ్యక్తం చేశారు.
నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తా…
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ గలవాలని అందరి సహకారంతో సుపరిపాలన అందించే దిశగా… నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తానని పులివర్తి నాని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నుంచి బయట పడేయగల సత్తా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు సమస్యలు పరిష్కారం కూడా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఈసారి టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ద్వారకా నగర్ లో కోట్లు విలువైన భూమి కబ్జా…
పేరూరు పంచాయితీ, ద్వారకా నగర్ లో సర్వే నెంబర్ 531/1 లో సుమారు రూ.3 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని పులివర్తి నాని ఆరోపించారు. ఎక్కడ సెంటు భూమి కనిపించినా వదలడం లేదని మండిపడ్డారు. ఇకనైనా అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. స్పందించకపోతే భవిష్యత్తులో ప్రజలతో కలిసి ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.