- తప్పులు తడకగా ఓటర్లు జాబితా…
- బోగస్ ఓట్లు తొలగించండి…
- ఒక్కో ఇంటి నెంబర్ పై అధిక ఓట్లు…
- కుటుంబంలో 4 ఉంటే నాలుగు బూతులు…
- కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి “పులివర్తి నాని”
తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో గతకొన్ని రోజులుగా బోగస్ ఓట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. శుక్రవారం పార్టీ నేతలతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ 6 మండలాల్లో ఎక్కడ ఓటర్ల జాబితాలను పరిశీలించినా, సర్వే చేసినా.. తప్పుల తడకలుగా దర్శనమిస్తున్నాయన్నారు. దీంతోపాటు వందల సంఖ్యల్లో బోగస్ ఓట్లు వెలుగు చూస్తున్నాయని, అంతేకాకుండా ఒకే ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యల్లో బోగస్ ఓట్లు ఉండటం గుర్తించామన్నారు. అలాగే ఒక డోర్ నెంబర్ లో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు బూతులుగా విడగొట్టి ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తీన్నారని మండిపడ్డారు. ఓటర్లు జాబితానే తప్పుల తడకలుగా రూపొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. కీలకమైన పేజీల్లో.. చిరునామాలను గందరగోళంగా నమోదు చేస్తున్నారని అన్నారు. ఓటర్లు జాబితాను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా పోలింగ్ బూతుల మార్పిడి, కొత్త బూతులు ఏర్పాటు, తప్పులు తడకగా ఓటర్లు జాబితా, బోగస్ ఓట్లు తొలగింపు పలు అంశాలపై ఎన్నికల అధికారికి, ఓటరు నమోదు అధికారికి, రెవిన్యూ డివిజనల్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు పులివర్తి నాని తెలిపారు.