చిత్తూరు జిల్లా, పుంగనూరు : పోలీస్ స్టేషన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిఎస్పి డేగుల ప్రభాకర్ కు వైభవలక్ష్మి గ్రూప్ సభ్యులకు చెందిన 250 మంది సభ్యుల 32 లక్షల రూపాయల నిధులను ఆర్పి రెడ్డి రాణి కాజేసారని అర్జీ రూపంలో ఫిర్యాదు చేశారు. నిధులు కాజేసిన ఆర్పి రెడ్డిరాణి విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ సమైక్య సభ్యులు సమర్పించిన అర్జీ కి సంబందించి పూర్తిగా విచారణ జేసీ ఆర్పి పై వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
