భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు మరణానంతరం భారతరత్న ప్రకటించడంపై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వి.సుధాకర్ సంతోషం వ్యక్తం చేశారు.
సుప్రసిద్ధ పండితుడు, నాయకుడు, ఆర్థికవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, మానవతావాది మన పీవీ నరసింహారావు అని కీర్తించారు.ఓ రాజనీతిజ్ఞుడిగా ఈ దేశానికి పీవీ నరసింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా కొత్త అడుగులు వేసింది కూడా ఆయన పాలనలోనే అని స్పష్టం చేశారు. విదేశాంగ నిపుణుడిగా, విద్యా రంగ కోవిదుడిగా పీవీ అందించిన సహకారం భారతదేశాన్ని సాంస్కృతికంగా, మేథో పరంగా సుసంపన్నం చేసిందని, పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో తెలంగాణ ప్రజలకు నిజమైన గౌరవం దక్కినట్టయిందని తెలిపారు.