నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో చాలావరకు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే జయకేతనం అని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా మళ్లీ బీజేపీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ఆ ఎగ్జిట్ పోల్స్ వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నాయని అన్నారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదు… మోదీ మీడియా పోల్స్ అని విమర్శించారు. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోదీ మనసు నుంచి పుట్టుకొచ్చిన ఊహాజనితాలు… అంతా కల్పితం… ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బోగస్… అంతా నాటకం అని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇండియా కూటమి మనో ధైర్యం తగ్గించేందుకు మోదీ ఆడుతున్న ఆట ఇది అని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒత్తిడి పెంచే వ్యూహాలతో ప్రధాని మైండ్ గేమ్ ఆడుతున్నారని పేర్కొంది.