రాహుల్ గాంధీ ఈ నెల 6న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
షెడ్యూల్…
- మే 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి రాక.
- శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ పయనం.
- వరంగలో రైతు సంఘర్షణ సభకు హాజరు.
- రాత్రి 7 గంటలకు రాహుల్ ప్రసంగం ప్రారంభం.
- సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరిక.
- దుర్గం చెరువు పక్కనే ఉన్న కోహినూర్ హోటల్ లో రాహుల్ కు బస ఏర్పాటు.
- మే 7న ఉదయం కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసి కోహినూర్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్.
- సంజీవయ్య పార్కులో నివాళులు అర్పించే కార్యక్రమానికి హాజరు.
- అనంతరం, గాంధీభవన్ లో 200 మంది ముఖ్యనేతలతో సమావేశం.
- డిజిటల్ మెంబర్ షిప్ ఫొటో సెషన్ లో పాల్గొననున్న రాహుల్.
- తెలంగాణ అమరవీరులతో కలిసి భోజనం చేయనున్న కాంగ్రెస్ అగ్రనేత.
- సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ పయనం.