రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా 53వ రోజు ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బాల్ నగర్ మండలంలో ఏర్పాటు చేసిన సామాజిక కార్యకర్తలు, మేధావులు సదస్సులో రాహుల్ గాంధీ పాలోన్నారు. ఈ సందర్భంగా దాదాపు 45 మంది తెలంగాణకు చెందిన పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలతో రాహుల్ గాంధీ పలు అంశాలను చర్చించారు. ప్రధానంగా భారత దేశ పునర్నిర్మాణం, రాజ్యాంగ హక్కుల రక్షణ, భారతీయ సంస్కృతి, చరిత్ర, నిరుద్యోగం, సహజ వనరుల సంరక్షణ, కార్మికరంగం, యువజన తదితర అంశాలపై సామాజిక కార్యకర్తల, మేధావుల సూచనలను, సలహాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో అన్ని రంగాలు తిరోగమనం దిశగా ప్రయాణిస్తున్నయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మళ్ళీ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సామాన్యులకు సైతం రాజ్యాంగ హక్కుల అందుతాయని, భారతీయ సంస్కృతి, చరిత్ర కాపాడడంతో పాటు దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగాన్ని తగ్గిస్థామని, సహజ వనరుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తెస్తాని, కార్మికరంగ చట్టాలను పరిరక్షమన్నారు. అంతేకాకుండా 72 వేల మందికి ప్రతి సంవత్సరం వ్యవసాయం, మవళిక సదుపాయాల కోసం సహాయం చేస్తామన్నారు. వీటితోపాటు వివిధ అంశాలపై దాదాపు 45 నిమిషాల పాటు రాహుల్ గాంధీ సామాజిక కార్యకర్తలు, మేధావులతో తన భారత్ జోడో యాత్ర నేపథ్యం, ప్రస్తుతం భారత దేశం ఎదుర్కొంటున్నా పరిస్థితిల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మెగాసిస్ అవార్డ్ గ్రహీత, జాతీయ బాలల హక్కుల మాజీ చైర్మన్ ప్రొఫెసర్. శాంతా సిన్హా, మహిళా జెఏసి నాయకురాలు సాజయా, వీసా ఆర్ఎస్ కిరణ్, గీతా రామస్వామి, జశ్విన్, మ్రుదుల దేశాఈ, రామా మేల్కొటే, ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ లిసి జోసఫ్, సుశీ, సభా, బీఆర్. వర్గాసే, సారా మ్యాథుస్, శరత్ విమలా, మీరా సంగమిత్రా,సివిల్ సొసైటీ ఉద్యమకారుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, మాజీ ఐఏఎస్ రమేష్ బాబు,
ఎం వి ప్ వెంకటరెడ్డి, ఇంజనీర్ లక్ష్మణ్, సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.