తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా తలారి మాట్లాడుతూ రైతన్న శ్రేయస్సు దృష్ట్యా పండించిన పంట దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు రైతు భరోసా కేంద్రం టెక్నికల్ సిబ్బంది కళ్ళం వద్దకే వచ్చి ధాన్యం నాణ్యత పరిశీలిస్తారని ధాన్యం విక్రయించిన రైతులకు 21రోజులలో నేరుగా వారి ఖాతాలో సొమ్ము జమ చేయబడుతుందని తెలిపారు రైతే గోనె సంచులు హమాలీ రవాణా కానీ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ సొమ్ము నేరుగా రైతుల ఖాతాలో కి దాన్యం సొమ్ముతో సహా 21 రోజులలో చెల్లించబడుతుందని తెలిపారు ధాన్యం కొనుగోలులో ఏ దశలోనైనా రైతు నష్టపోకుండా పూర్తి పారదర్శకతతో రైతుకు పూర్తి మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి రైతన్నలందరూ సహకరించాలని తలారి వెంకటరావు కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ దేవరపల్లి మండల తాసిల్దార్ రామకృష్ణ గ్రామ సర్పంచ్ భరత్ బాబు FFF ఆయిల్ పామ్ రాష్ట్ర డైరెక్టర్ నరహరిశెట్టి రాజేంద్ర బాబు సొసైటీ సీఈఓ మండాపెదబాబు తదితర
