contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతు రుణమాఫీ పై అవగాహన కార్యక్రమం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో గునుకుల కొండాపూర్ రైతు వేదిక మరియు గన్నేరువరం రైతు వేదికలలో రైతు రుణమాఫీ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ బద్దం తిరుపతి రెడ్డి,ఎంపిటిసి గూడేల్లి ఆంజనేయులు, మరియు వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సిబ్బంది ఏవో అండ్ ఏఈఓ గుండ్లపల్లి ఎస్.బి.ఐ ఫీల్డ్ ఆఫీసర్,తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మరియు ఇండియన్ బ్యాంక్ గన్నేరువరం మేనేజర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ 2018 డిసెంబర్ 12 లోపు పంట రుణం తీసుకున్న రైతులకి రైతు రుణమాఫీ వర్తిస్తుంది అని తెలిపారు. రైతు కుటుంబానికి ఒక లక్ష రూపాయల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. రైతులకి సెప్టెంబర్ 30 లోపు రుణమాఫీ డబ్బులు జమ కావడం జరుగుతుందని, రుణమాఫీ డబ్బులు ఇంకా రాని రైతులు చింత పడొద్దు అని చెప్పారు.సెప్టెంబర్ 30 లోపు అర్హులైన రైతులకి రుణమాఫీ వారి క్రాప్ లోన్ అకౌంట్ యాక్టివ్గా ఉంటే వారి ఖాతాలోనే జమ కావడం జరుగుతుంది,లేనియెడల వారి రైతుబంధు అకౌంట్ కి జమ కావడం జరుగుతుంది. ఒకవేళ రైతుకి రైతుబంధు అకౌంట్ కూడా లేకపోతే ఆధార్ తో లింక్ అయినా సేవింగ్ ఖాతాలో డబ్బులు జమ కావడం జరుగుతుంది. అప్పుడు రుణమాఫీ తీసుకున్నా రైతులు ఇప్పుడు చనిపోయి ఉంటే ఆ రైతు కుటుంబ సభ్యులు ఎమ్మార్వో ఆఫీస్ నుండి కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ తీసుకొని బ్యాంకులో ఇచ్చినట్లయితే వారి కుటుంబ సభ్యుల సేవింగ్ ఖాతా కి రుణమాఫీ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు. మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క బ్యాంకులో రుణమాఫీ కి సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ పెట్టి వారి సమస్యలకు పరిష్కారం సూచించాలని తెలిపారు. ఆ ప్రకారమే బ్యాంకు మేనేజర్లు మాట్లాడి వచ్చే మంగళవారం నుండి వారి బ్యాంకులో ఒక హెల్ప్ డెస్క్ ప్రారంభించి రుణమాఫీకి సంబంధించి సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కొండాపూర్ రైతు వేదికలో మరియు గన్నేరువరం రైతు వేదికలో ఏఈవో అనూష, ప్రశాంత్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :