తెలంగాణ / హైదరాబాద్ : రైతుబంధుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తీపికబురు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతుబంధు సాయం డబ్బు అకౌంట్లలో పడింది. ఇంకొందరికి పడలేదు. దీంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా కూసుమంచిలో మీడియాతో మాట్లాడారు. రైతుబంధుపై ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. సంక్రాంతి పండుగ అయిపోగానే అర్హులందరికీ రైతుబంధు అందుతుందని హామీ ఇచ్చారు.