హైదరాబాద్ : అమీర్ పేట లో గల రాజా హాస్పిటల్ తన చుట్టుపక్కల పప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచి, నలుగురికి పరిశుభ్రత గురించి చెప్పి పాటించే విధంగా చూడాల్సింది పోయి, అడ్డగోలుగా చెత్తను పక్క రోడ్డులో వేస్తూ .. ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారు. గతం లో కూడ ఇదే విధంగా చెత్తను వేస్తుంటే స్థానికులు చెప్పినప్పటికీ వినకుండా, మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు లే అని అడ్డగోలుగా వ్యవరిస్తున్నారు. అసలే కరోనా కాలం, చెత్తవలన దోమలు పెరుగుతున్నాయి. దోమ కాటుకి చిన్న పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారు. హాస్పిటల్ పరిసర ప్రాంతంలో వందలమంది నివాసముంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రాజా హాస్పిటల్ పై తగు చర్యలు తీసుకోవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.