మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బీజేపీ అధిష్ఠానం షాకిచ్చింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్ సోషల్‌మీడియాలో విడుదల చేసిన వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తమ దైవాన్ని అవమానించిన ఆయనపై కఠినచర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలే నుపుర్ శర్మ వ్యవహారంతో చిక్కుల్లో పడిన బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్న ఆయన్ని ఆ పదవి నుంచి కూడా తొలగిస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది.