ఎంతోమంది త్యాగదనుల ఫలితంగానే స్వాతంత్రం వచ్చిందని, స్వాతంత్రం వచ్చిన అనంతరం సంక్షేమ ఫలాలను అందించేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. రాజ్యాంగాన్ని రాశారని . పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వేమవరపు రాజారామ్ అన్నారు.
లగడపాడు గ్రామంలోని 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ కాలనీ అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేటి బాలలే రేపటి పౌరులని, అందరూ ఒక లక్ష్యంతో చదివి, పర్యావరణాన్ని కాపాడుతూ మంచి అలవాట్లతో పెరగాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గ్రామానికి దేశానికి. గర్వపడేలా ఎదగాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడవాలని తెలియజేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలకు అవసరమైన బుక్స్ , స్వీట్లు పంపిణీ చేశారు రాజారాం.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పాటిబండ్ల బాలయ్య మాట్లాడుతూ ఆత్యాగధనులకు, కర్మధనులకు, పుణ్యపురుషులకు, సహృదయమూర్తులకు నివాళి సమర్పించడం మనందరి కర్తవ్యం అని పేర్కొన్నారు.
అందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. తెలిపారు నాయకులు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేమవరపు నాగేశ్వరరావు, అంగన్వాడి టీచర్లు , విద్యా కమిటీ చైర్మన్, స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.