ఎస్సీ ఎస్టీ కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ ది 19-08-2022 సాయంత్రం 06 గంటలకు ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర గల బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ ఎస్టీ కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాజస్థాన్ లో దళిత విద్యార్థి కుండలోని మంచినీరు తాగాడని అతి కిరాతకంగా కొట్టటం వల్ల తీవ్రంగా గాయపడి మరణించడం , దళిత మహిళా టీచర్ ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆమె పై పెట్రోల్ పోసి నిప్పు అంటించడం వల్ల తీవ్రంగా కాలిపోయి మరణించడం పట్ల నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం వారి ఇరువురికి కొవ్వొత్తులతో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకీ ఎస్సీ ఎస్టీ లపై దాడులు, హత్యాకాండలు , అత్యాచారాలు గృహ ధహనాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ లపై జరిగే దమనకాండలను అరికట్టడంలో వైఫల్యం చెందాయని భవిష్యత్తు లో ఇలాంటివి పునరావృతం అయితే ఎస్సీ ఎస్టీ లంతా ఐక్యమై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల కు తగు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చాగంటి సంజీవ్, ప్రధాన కార్యదర్శి పొలిమెర హరికృష్ణ, కోఆర్డినేటర్ లు పళ్ళెం ప్రసాద్ , నేతల రమేష్ బాబు, మెండెం సంతోష్ కుమార్, జిల్లా ఎట్రాసిటీ కమిటీ మెంబర్ మేతర అజయ్ బాబు, అలగ రవి కుమార్, ఎరికిపాటి విజయ్, కాపుదాసి రవి, భూపతి అప్పారావు, దాసి వెంకటేశ్వర్లు, పోలిమెట్ల మోజేస్, గొల్ల నరేష్ కురమా రాజు, పల్లా ఏసోబు , దర్మాచారి తదితరులు పాల్గొన్నారు.