మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ప్రజాజ్యోతి లో పని చేస్తున్న జర్నలిస్ట్ వెంకటేష్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు దాడిని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కోటి ఖండించారు. నిత్యం ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.