మరోసారి 10 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు రంగారెడ్డి జిల్లా లోని జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె ప్రవీణ్ కుమార్..
ఇప్పటికే ఓ సారి ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు.
సుమారు 20 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కొంత కాలం సస్పెండ్ అయినా.. ఆ అధికారి మాత్రం తన తీరు మార్చుకోలేదు…
రుచికి అలవాటు పడిన నాలుక మళ్లీ మళ్లీ అదే టేస్ట్ కోరుకుంటుందన్నట్టుగా మరోసారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు రంగారెడ్డి జిల్లా లోని జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె ప్రవీణ్ కుమార్…
భవన నిర్మాణానికి అనుకూలంగా అనుమతి ఇచ్చినందుకు గానూ.. ఓ రియల్టర్ దగ్గర ఏకంగా 10 లక్షల లంచం తీసుకుంటూ గద్దె ప్రవీణ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు…
రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నాడు. రియాల్టర్ కడారి అంజయ్య నిర్మిస్తున్న ఒక భవనానికి సంబంధించి అనుకూలంగా వ్యవహరించినందుకు గానూ.. పది లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలంటూ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశాడు..