పల్నాడు జిల్లా : సూర్యారావుపేటలోని ఓ సెలూన్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.అయితే, ఈ సెలూన్‌ను సీఐ తండ్రి లీజుకు తీసుకుని వేరొక వ్యక్తితో నడిపిస్తుండటంతో విషయాన్ని గోప్యంగా ఉంచారు.
వివరాల్లోకి వెళితే..నగరంలోని పలు స్పాలు, సెలూన్లపై కొద్దిరోజుల కిందట పోలీసులు దాడులు చేశారు.ఆ సమయంలోనే సూర్యారావుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఆసుపత్రి భవనం పైఅంతస్తులో నిర్వహిస్తున్న సెలూన్‌ను తనిఖీ చేశారు. ప్రసాదంపాడుకు చెందిన ఒక మహిళ ఈ సెలూన్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. వీరంతా కలిసి ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు సెలూన్ పై దాడిచేసి నిర్వాహకులతో పాటు అందులో ఉన్న ఏడుగురు యువకులు,ఎనిమిది మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. గుడివాడ, అంబాపురం, గాంధీనగర్, ఎస్ఎన్ పురం, సత్తెనపల్లికి చెందిన వ్యక్తులను అరెస్టు చేశారు. యువతులను హోమ్క తరలించారు. సీఐ తండ్రి సెలూన్ నిర్వాహకుడిగా ఉండటంతో ఇదే విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం.