- సుపరి పాలనకు బ్రహ్మరథం పట్టిన మండల ప్రజలు
- హాజరైన గౌరవ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్
కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన సుపరి పాలన దినోత్సవంలో గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ ప్రతి పక్షాలపై గర్జించారు. ఈ వేడుకలకు గౌరవ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ మరియు బీ.ఆర్.ఎస్. పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి. రామకృష్ణా రావు హాజరయ్యారు. ముందుగా పోలీస్ స్టేషన్ సమీపంలోని డా. బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. డప్పు చప్పుళ్లతో, డీజే మోతలతో, కోలాటం నృత్యాలతో, మహిళలు నెత్తిన భోనాలు మరియు బతుకమ్మలు ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగాణానికి చేరుకున్నారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలి రాగ, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పది సంవత్సరాల సుపరి పాలనలో జరిగిన అభివృద్ధిని వినోద్ కుమార్ మరియు రసమయి కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఎమ్మెల్యే రసమయి తన మాట, పాటలతో గన్నేరువరం మండలంలో చేపట్టిన అభివృద్ది పనులను వివరిస్తూ, అసత్య ఆరోపణల చేస్తున్న ప్రతిపక్ష నేతల తప్పుడు కూతలపై గర్జిస్తూ ప్రజలను విశేషంగా అలరించారు. గన్నేరువరం మండలానికి డబుల్ రోడ్డుకు రానున్న 15 రోజుల్లో టెండర్ పూర్తి చేసి పనులను ప్రారంభించనున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన పల్లి వినోద్ కుమార్ అన్నారు. గన్నేరువరం మండలం ఏర్పాటుకు వినోద్ కుమార్ కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన, ఎంపీడీవో స్వాతి, తాసిల్దార్ అనంతరెడ్డి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, (ఐకెపి) ఎపిఎం లావణ్య తదితరులు పాల్గొన్నారు.