contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఊరూవాడా కదిలి … ఉప్పెనల మారిన గన్నేరువరం

  • మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కి భారీ స్వాగతం
  • 17 కిలోమీటర్ల బైక్ ర్యాలీ
  • గన్నేరువరం లో వేలాదిమంది హాజరైన ప్రజలు
  • కాంగ్రెస్ వస్తే ప్రజల బ్రతుకులను ఆగం చేస్తారు
  • కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో ప్రజలను పీక్కుతింటున్నారు
  • ఎన్నికలంటే ఓట్ల పండుగ కాదు…ప్రజల ఐదేళ్ల భవిష్యత్తు అని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు.

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి నుంచి 17 కిలోమీటర్ల దూరం బైక్ ర్యాలీ నిర్వహించి గన్నేరువరం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గన్నేరువరం మండల కేంద్రంలో వేలాది మంది మహిళలు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఆస్పత్రులు పెట్టి దొచుకున్న డబ్బులను ఇక్కడకు వచ్చి నాయకులను డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారు. కానీ మానకొండూర్ నియోజకవర్గ ప్రజలను కొనలేరని, ప్రజలంతా రసమయి బాలకిషన్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు.
మానకొండూర్ నియోజకవర్గములోని ప్రతి దళిత కుటుంబానికి హుజురాబాద్ మాదిరిగా దలితబంధు పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు.

కర్ణాటకలో గత బీజేపీ పాలనలో 9 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4,5 గంటలు మాత్రమే ఇస్తుంది. తమ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని అక్కడి రైతులు చెప్తున్నరు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ చాలు అంటున్నడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 5 గంటలు చాలు అంటున్నడు కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలంటే కారుకే గుద్దాలి కేసీఆర్ రాకముందు వ్యవసాయం దండగ అన్నరు. పిల్లను కూడా ఇచ్చేటోళ్లు కాదు. మందు బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టిన దుస్థితి. పెట్టుబడి సాయం కావాలంటే 3 రూపాయలు, ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకున్నం. కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చిండు. పెట్టుబడి ఇచ్చిండు. చెరువులు మంచిగ చేసిండు. నీళ్లు ఇచ్చిండు. విత్తనాలు ఇచ్చిండు. పంట పండిన తర్వాత గింజ వదలకుండా కాంటాలు పెట్టి కొన్నడు. నాటి సమైక్య పాలనలో కూలీ పనులు దొరకడం లేదని చెప్పేటోళ్లు. కానీ ఇప్పుడు కూలోళ్లు దొరకుతలేరని అంటున్నరు. వేరే రాష్ట్రాల నుంచి మగవాళ్లు వచ్చి వరి నాట్లు వేస్తున్నరు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుకు సాయం చేయలేదు. రైతు దగ్గరే డబ్బు వసూలు చేసిండ్రు. కానీ రైతుకే తిరిగి డబ్బు ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్.రైతు బంధును కాపీ కొట్టిండ్రు. కాంగ్రెసోళ్లు రైతుకు 15 వేలు ఇస్తమంటున్నరు. కానీ కేసీఆర్ మాత్రం ఎకరాకు 16 వేలు ఇస్త అంటున్నడు. కాంగ్రెస్ మోసాన్ని రైతులు గ్రహించాలి.

కర్ణాటక రైతులు మోసపోయినట్టు తెలంగాణ రైతులు ఆగం కావద్దు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతు బంధుకు ఎగనామం పెట్టింది.
ఐదు గ్యారంటీల్లో యువశక్తి పథకం ఇంకా ప్రారంభించలేదు. కారణం ఏంటంటే ఖజానా ఖాళీ అని చెప్తున్నరు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలే. తెలంగాణ గాంధీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్నరు.
కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తుంటే కర్ణాటకలో రూపాయి కూడా ఇవ్వట్లేదు. 2 వేల పింఛన్ను కేసీఆర్ 5 వేలు ఇస్తా అంటున్నడు. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తానని కేసీఆర్ చెప్తుండు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవంగనే కరువు పడ్డది. తిండి గింజలు లేక బియ్యం కావాలని మనల్ని బతిమాలుడుతున్నరు. అంటే మనం అభివృద్ధి అయినట్టా? కానట్టా? మూడో సారి గెలిస్తే అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. బీజేపీ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరని తగ్గించి రూ. 400 కే ఇస్తాం
మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సౌభాగ్య లక్ష్మి అనే కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. ప్రతీనెలా 3 వేల రూపాయలను వారి బ్యాంకు అకౌంటులో వేయాలని నిర్ణయం తీసుకున్నారు. భూమి ఉన్న వారికి రైతు బంధు పెంపు, లేని వారికి 5 లక్షల బీమా అమలు చేస్తాం.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు దేవుడెరుగు కానీ ఆర్నెల్లకు ఒక సీఎం మారుడు మాత్రం పక్కా అన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ లింగాల మహేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :