సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండల అద్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమం లో రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు డా. రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ ఆధైర్య పడొద్దని, అందరినీ కడుపులోపెట్టుకుని చూసుకుంటామని,గత ఐదేళ్లలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ నియోజకర్గంలో నయాపైసా అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ మోసపూరిత, సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని, మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడాలని,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఅర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతే కాంగ్రెస్ మాత్రం రాష్ర్టాని ఆగం చేస్తున్నదని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కేసీఅర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.