కరీంనగర్ జిల్లా: రానున్న పార్లమెంట్ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడి లాగ పని చేసి బోయినపల్లి వినోద్ కుమార్ ని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్.రసమయి బాలకిషన్ అన్నారు, గన్నేరువరం మండల కేంద్రంలోని బీఆర్ ఎస్ పార్టీ కార్యలయంలో మండల పార్టీ అధ్యక్షులు గంప వెంకన్న అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి మానకొండూర్ మాజీ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ మరియు టెస్కాబ్ చైర్మేన్ కొండూరి రవిందర్ రావు ముఖ్య అథితిగా హజరై ప్రజా ప్రతినిధులను,కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 12 న జరిగే కదన బేరి చలో కరీంనగర్ కేసీ ఆర్ సభను విజయవంతం చేయాలని ప్రతి గ్రామం నుండి భారీగా జన సమీకరణ చేయాలని అన్నారు.అదే విదంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పని చేయాలని అన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి ఒక్కరూపాయి పని చేయలేదని, కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తే,ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్టాన్ని ఆగం చేస్తున్నారని అన్నారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా తోడు ఉంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కార్యకర్తలు- అధైర్య పడవద్దని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని అందరికి అందుబాటులో ఉంటానని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలపై గ్రామ గ్రామాన ఉద్యమించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలాభివృద్దికి శాయశక్తుల కృషి చేశానని అన్నారు. పార్టీలో కొనసాగుతూ,పార్టీకి నమ్మకద్రోహం చేసే వారు మాకు పని చేస్తున్నట్టు నటిస్తూ వెన్నుపోటు పొడవద్దని పార్టీ అందరిని గ్రహిస్తుందని అన్నారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తలే ముఖ్యమని వారే కావాలని అన్నారు. ఇప్పటికైనా కార్యకర్తలు పార్టీ కోసం సమిష్టిగా పని చేసి కుల సంఘాలు, మహిళ సంఘాల సభ్యులతో సంఘటితమై రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికకు కష్టపడి పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి అంజనేయులు,మండల మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన,నాయకులు న్యాత సుధాకర్,బోయిని కుమార్,తదితరులు పాల్గొన్నారు.