- బిజెపి నాయకుల నిరసన కార్యక్రమానికి
- వెనుదిరిగి కొండాపూర్ నుండి తోటపల్లి వెళ్లిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: భారతీయ జనతా పార్టీ గన్నేరువరం మండల శాఖ అధ్యక్షులు నగునూరి శంకర్ ఆధ్వర్యంలో గుండ్లపల్లి నుండి కొండాపూర్ వరకు వర్షంలో తడుస్తూ నాటు వేసి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్ నిర్మాణం ఎప్పుడు చెపడతారు…? ప్రభుత్వం ఇచ్చిన 71 కోట్ల నిధుల జీవో ఏమైంది అని అన్నారు. మరియు రోడ్ వేస్తాం అని చెప్పి ఉన్న రోడ్ ని తవ్వి వదిలేసారు. గుండ్లపల్లి, కొండాపూర్ ప్రజలు మొన్నటి వరకు దుమ్ము, ధూళి తో అవస్థలు పడ్డారు. ఇప్పుడు గుంతలతో, బురదతో అవస్థలు పడుతున్నారు. మండల ప్రజల కష్టాలు తిరేదేన్నాడు…? ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. మరియు త్వరగా డబుల్ రోడ్ పనులు ప్రారంభించి రోడ్ వేయకపోతే మండలంలో తిరగనివ్వకుండా ఎక్కడికిఅక్కడ అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తామని హేచ్చరించారు. బిజెపి నాయకుల నిరసన కార్యక్రమం గురించి తెలుసుకొని కొండాపూర్ నుండి తోటపల్లి మీదిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. వెనుకతిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గడ్డం సుమిత్ రెడ్డి, తాళ్లపల్లి పరుశరామ్, మండల సోషల్ మీడియా కన్వీనర్ మచ్చ మురళీకృష్ణ, కుర్ర హరీష్, వేల్పుల తిరుపతి, వేల్పుల అజయ్, గుర్రం అరవింద్, జుట్టు రాకేష్, కాల్వ రాజు, కాల్వ రాము, తాళ్లపల్లి మణికంఠ, మేండే శ్రీకాంత్, పంబాల సాయిరాం, కాల్వ సంతోష్, మల్లెత్తుల సత్తి, కాల్వ సాగర్, దోపాట మధు, దానబోయిన రాజకుమార్, రామిడి కృషమూర్తి, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.