- మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్
- ఖాసీంపేటలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం, భూమిపూజ
- పీచుపల్లిలో రెడ్డి సంఘ భవనం ప్రారభం
- ప్రజానేతకు జననీరాజనం
- యాభై ఏళ్లలో ఇవ్వని హామీలు ఇప్పుడెందుకు ఇస్తున్నారు
- కాంగ్రేస్ వాళ్ళు చెప్పేవన్ని దొంగ మాటలే
- ప్రజలు కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయం
- అప్పుడు లేని గ్యారంటీ…ఇప్పుడెలా అమలు చేస్తారు
కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ బూటకపు హామీలతో వారంటీలేని నాయకులు గ్యారెంటీ హామీలు ఇస్తూ ప్రజలను మాయ చేస్తున్నారని, యాభై ఏళ్ళ కాలంలో చేయలేని అభివృద్ధి, ఇప్పుడు గ్యారెంటీ పేరుతో వారంటీ లేని హామీలు ఇస్తున్నారని…ఈ దొంగల ముఠా కాంగ్రెస్ మాటలను ప్రజలు ఎలా నమ్ముతారని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. గన్నేరువరం మండలంలోని పీచుపల్లిలో రెడ్డి సంఘం భవనం ప్రారంభం చేశారు. ఖాసీంపేట గ్రామంలో రెడ్డి సంఘం, అంబేద్కర్ సంఘం భవనాలకు భూమిపూజ చేయడంతో పాటు సీసీ రోడ్లు ,మానసాదేవి ఆలయం వద్ద భవనాన్ని ప్రారంభం చేశారు. గ్రామ యువకులకు కేసీఆర్ క్రీడాకిట్లను పంపిణీ చేశారు. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఖాసీంపేట గ్రామ ఆడబిడ్డలు బతుకమ్మలు, భోనాలతో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి ఘనస్వాగతం పలికారు. కిలోమీటరు పొడవునా మహిళలు,ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలతో అధికారం చేపట్టాలనే దురుద్దేశ్యంతో సాధ్యంకాని దొంగ హామీలు ఇస్తోందని, ప్రజలను మాయ చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. యాభై ఏళ్ళ కాలంలో ఇవ్వని గ్యారంటీ హామీలు ఇప్పుడెందుకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్రంలో సాధ్యంకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదని, తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గ్యారెంటిలేని హామీలు ఇస్తుందని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే టూరిస్టులెక్క వచ్చే కవ్వంపల్లి సత్యనారాయణ కు నియోజకవర్గములో అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలియదని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కవ్వంపల్లి స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మాణం చేయడం జరిగిందని, ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి గృహాలక్ష్మి ద్వారా రూ. మూడు లక్షల సాయం అందించడం జరుగుతుందని అన్నారు. దళితులకు దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షల సాయం అందిస్తున్నామని, బీసీ బంధు ద్వారా కులవృత్తులపై ఆధారపడిన వారికి రూ 1లక్ష సాయం అందిస్తున్నామన్నారు. కళ్యాణాలక్ష్మి,షాదీముబారక్ పథకాల ద్వారా ఆడబిడ్డల పెళ్ళికి రూ లక్ష 116 సాయం చేస్తున్నామని, గత ప్రభుత్వాలు ఆడబిడ్డల పెళ్లికి నయాపైసా సాయం అందించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు సాగునీళ్లు లేక వలసలు పోయిన రైతులు ,కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షలాది ఎకరాల బీడుభూలకు సాగు నీళ్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి కూలీలు వస్తున్నారని, తెలంగాణ రైతుల బ్రతుకుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వెలుగులు నింపిందని పేర్కొన్నారు. అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని, ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ఉన్నారని పేర్కొన్నారు. బూటకపు హామీలు ఇస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు మరోసారి కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని అన్నారు. గడప గడపకు కాంగ్రెస్ ఒక దొంగనాటకమని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఉన్న సంక్షేమ పథకాలలో కోత పెట్టడమేనని, కాంగ్రెస్ హయాంలో 2వందల పెన్షన్ ఇస్తే… కేసీఆర్ సీఎం అయ్యాకా రూ.4016, 2016 పెన్షలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచడం కోసమే ప్రతి ఏడాది బతుకమ్మ పండుకకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఐదేళ్ళకోసారి నియోజకవర్గానికి ఎన్నికల కోసమే వచ్చే కొత్త బిచ్చగాడి మాటలు ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఉన్నాయని, అసలు కవ్వంపల్లి సత్యనారాయణ ఏ పార్టీలో ఉంటాడో గ్యారెంటీ లేదని…ఇక ప్రజలకు ఈ వారంటీలేని కవ్వంపల్లి ఏం గ్యారెంటీ ఇస్తాడని విమర్శించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, ఖాసీంపేట సర్పంచ్ గంప మల్లీశ్వరి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గుడెల్లి తిరుపతి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి,వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ స్వాతి, ఏపీఎం ఐకేపీ లావణ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Fire-Boltt Ninja Call Pro Plus 1.83″ Smart Watch with Bluetooth Calling, AI Voice Assistance, 100 Sports Modes IP67 Rating, 240 * 280 Pixel High Resolution
Deal Price: ₹1,099 – M.R.P.: ₹19,999
https://amzn.to/3RPUKAL