- మానకొండూర్ ఎమ్మెల్యే,తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్
- రైతాంగానికి భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం
- జంగపల్లిలో ప్రజా ఆశీర్వాద సభ
- ప్రజానేత రసమయన్నకు బతుకమ్మలు, భోనాలతో స్వాగతం పలికిన ఆడబిడ్డలు
- జనసంద్రమైన జంగపెల్లి
- మూడవ సారీ హ్యాట్రిక్ విజయం ఖాయమన్న జంగపెల్లి ప్రజలు
- కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల బ్రతుకులు ఆగం అయినట్టే
- బీఆర్ఎస్ లో భారీగా చేరికలు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో బుధవారం ప్రజా ఆశీర్వాద సభకు మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ హాజరయ్యారు. జంగపల్లి ఆడబిడ్డలు బతుకమ్మలు, భోనాలతో ఘనస్వాగతం పలికారు.రసమయి మూడవ సారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు హోరెత్తించారు.వివిధ పార్టీలకు చెందిన 50 మంది బీఆర్ఎస్ లో చేరగా గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసి.. సామాన్య ప్రజానికానికి అండగా నిలిచిన ఘనత బీ.ఆర్.ఎస్ కే దక్కుతుందని, కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనకు కర్ణాటక రాష్ట్రంలో తలెత్తుతున్న పరిస్థితులు తాజా నిదర్శనమని అన్నారు. అభివృద్ధి పనుల పట్ల, ప్రజలకు ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేయడం, ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కర్ణాటకలో రైతులకు పండించిన పంటలు ఎండిపోతున్నప్పటికీ.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని వాగ్దానం ఇచ్చి… బస్సుల్లో పురుషులు మాత్రమే ప్రయానించాలని బోర్డులు పెట్టడం వారి అసమర్ధ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్న ఎమ్మెల్యే…. బడుగు, బలహీన, నిరుపేద వర్గాలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు రైతులు పొలాలను బీళ్లు పెట్టి గల్ఫ్ దేశాలు, ముంబాయి, బీవండి,హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బ్రతుకుదేరువు కోసం వెళ్లే వారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నెర్రెలు భారిన నేలకు ఎర్రటీ ఎండలో కూడా సాగునీళ్లు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.200ల పెన్షన్ ఉండేదని కేసీఆర్ సీఎం అయ్యాక వికలాంగులకు రూ.4016,వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడికార్మికులకు రూ.2016 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, మళ్లీ అధికారంలోకి రాగానే వికలాంగుల పెన్షన్ రూ.6016, ఆసరా పెన్షన్ రూ.5016 చేయడం జరుగుతుందన్నారు.
రైతులకు పెట్టుబడి సాయం ఎకరాకు రూ.16వేలకు పెంచడం జరుగుతున్నదని, ప్రతి కుటుంబానికి రైతుభీమా మాదిరిగా రూ.5లక్షల భీమా సదుపాయం కల్పించడం జరుగుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కోతల కరెంటు ఉండేదని, అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, రాత్రి కరెంటుకు రైతులు బలయ్యేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ గారు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. గృహలక్ష్మీ పథకం ద్వారా ఇంటిస్థలం ఉన్న ప్రతి ఒక్కరికి రూ.3లక్షల సాయం చేయడం జరుగుతుందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలనే ఏడాది కాలంగా అమలు చేయలేదని..తెలంగాణ లో అధికారం కోసమే కాంగ్రెస్ 6 గ్యారెంటీ ల పేరుతో దొంగ హామీలు ఇస్తోందని..ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగం అవుతారని అన్నారు..మూడవ సారి కూడా తెలంగాణ రాష్ట్రంలో …సారూ..కారు.. కేసీఆర్ సర్కారు కొలువుదీరబోతుందని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల సాయం చేస్తామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, కులవృత్తులపై ఆధారపడిన బీసీ కులస్తులకు లక్ష సాయం చేస్తామన్నారు.ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, జంగపల్లి సర్పంచ్ అట్టికం శారద, మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన, గ్రామ శాఖ అధ్యక్షుడు మహంకాళి ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.