సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ :బెజ్జంకి మండల కేంద్రము నుండి బేగంపేట గ్రామం వరకు 9 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించిన గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, “సీఎం కేసీఆర్ పాలనలో రోడ్లకు మహర్దశ పట్టిందని, బీఆర్ఎస్ తోనే అభివృద్ది సాధ్యం అని, గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తెలంగాణ హయాంలో జరిగిందని, సీఎం కేసీఆర్ అధ్వర్యంలో జరుగుతున్న అభవృద్ధిపై ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని” తెలిపారు.
వీరితో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, బేగంపేట సర్పంచ్ చింతల పల్లి సంజీవ రెడ్డి, ఎంపీటీసీ దుంబాల రాజా మహేందర్ రెడ్డి, మాజీ AMC చైర్మన్ కచ్చూ రాజయ్య, ముక్కిస రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,యువజన అధ్యక్షులు బిగుల్ల మోహన్, AMC డైరక్టర్ లింగాల తిరుపతి, మామిండ్ల తిరుపతి, వడ్లూరి పర్శరములు, మొదుంపల్లి రాజు సోషల్ మీడియా ఇంచార్జ్ ఎలా శేఖర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.