- క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిభిరాన్ని ప్రారంభించిన
- బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి. రామకృష్ణా రావు
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో జనహృదయ నేత, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్. పార్టీ కుటుంబ సభ్యులు తమ అభిమాన నాయకుడు రసమయి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ ఆనందత్సాలతో జరుపుకున్నారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో బీ.ఆర్.ఎస్.పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు సుడా ఛైర్మెన్ జీవి. రామకృష్ణారావు కేక్ కట్ చేసి, రక్తదాన శిభిరాన్ని ప్రారభించగా,నియోజకవర్గం లోని ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్.పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వచ్చి రక్త దానం చేశారు.