- మానకొండూర్ ఎమ్మెల్యే,తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్
- ఖాసీంపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
- ప్రజానాయకుడికి ఘనస్వాగతం పలికిన ప్రజలు,నాయకులు
- ఎన్నికలు వస్తేనే ప్రతిపక్షాలకు ప్రజలు గుర్తోస్తారు
- ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీఆర్ఎస్ దే గెలుపు
కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పి, ఊసరవెల్లి లెక్క రంగులు మార్చే టూరిస్టుల మాయలో పడి ప్రజలు మోసపోవద్దని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. పూటకో వేషం, రోజుకో మాట మాట్లాడుతూ పగటి బిచ్చగాళ్ల లెక్క ఊర్ల మీద పడి ప్రజలను మాయ చేయాలని కొందరు టూరిస్టు నాయకులు కుట్రలు చేస్తున్నారని, మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే మూడవ సారి కూడా పట్టం కడతారని పేర్కొన్నారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తాను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ రైతులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి కుటుంబాలను పోషించేవారని, ముంబాయి, హైదరాబాద్, బీవండి వంటి ప్రాంతాలకు వలస కూడా వెళ్లే వారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి, భీడుభూము లకు సాగు నీరందించి పచ్చటి మాగానులుగా మార్చినారన్నారు. ఒకప్పుడు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే తెలంగాణ రైతులు ఇప్పుడు రెండు పంటలకు సాగునీళ్లు అందడంతో ఇక్కడకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి పనులు చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతుబందు, రైతుభీమా, ఆసరా పెన్షన్లు, దళితబంధు,బీసీ బంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, కళ్యాణాలక్ష్మి,షాదీముబారక్, మైనారిటీ బంధు వంటి పథకాలతో ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రం గన్నేరువరం, సాంబయ్య పల్లె, వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు గంప వెంకన్నతో కలిసి పర్యటించారు.ఈ కార్యక్రమం లో జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు,ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్, రైతుబంధు అధ్యక్షులు బద్దం తిరుపతిరెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నక్క దామోదర్, మండల యూత్ అధ్యక్షుడు బోయిని కుమార్, బేడ బుడగ జంగాల మానకొండూరు నియోజవర్గ అధ్యక్షుడు టేకు అనిల్, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూన చంద్రశేఖర్, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.