- అమ్మాయి తల్లిదండ్రులకు బైక్ అందజేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి
- మాట తప్పని జననేతకు జేజేలు పలుకుతున్న జనం..
కరీంనగర్ జిల్లా: బైక్ కోసం అలిగిన ఓ పెళ్లి కొడుకుకు పెళ్లి సమయంలో నచ్చజెప్పి లక్ష రూపాయల బైక్ ను అందజేసి ఓ ఆడ బిడ్డకు దేవుడిచ్చిన అన్నగా అండగా నిలిచాడు, మాట తప్పని, మడమ తిప్పని మంచి మనసున్న మారాజు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్. శంకరపట్నం మండలం అంబాల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ – మల్లయ్య కూతురు అనూష వివాహం సైదాపూర్ మండలం వెన్నెంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఇటీవల కేశవపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది,ఈ వివాహనికి ఎమ్మెల్యే రసమయి హాజరు కాగా, బైక్ కోసం పెండ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు బంధువుల మధ్య గొడవ జరడం కళ్ళారా చూసిన రసమయి కానుకగా నేనే ఇస్తాను పెళ్లి జరగనివ్వండి అంటూ హామీ ఇవ్వడంతో, ఇరు వర్గాలు శాంతించి, ఎమ్మెల్యే సమక్షంలోనే పెళ్లి జరిపించారు, అప్పటికప్పుడు రసమయి రూ. 50 వేల నగదును పెండ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు చేతిలో పెట్టి ఆశీర్వదించారు. అనంతరం మరో 50 వేల రూపాయలను షోరూంలో చెల్లించి బైక్ ను బుక్ చేశారు, ఇందులో భాగంగా షోరూం నుండి వచ్చిన బైక్ ను ఈరోజు పెళ్లి కూతురు అనూష తల్లిదండ్రులయిన లక్ష్మీ, మల్లయ్యకు ఎమ్మెల్యే అందజేసి తన ఔదర్యాన్ని చాటుకున్నారు.ఈ సందర్బంగా అనూష తల్లిదండ్రులతో పాటు మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు బీ.ఆర్.ఎస్. పార్టీ శ్రేణులు జననేత ఎమ్మెల్యే రసమయి ని అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలిపారు..