కరీంనగర్ జిల్లా : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ వేడుకలను ఈనెల 14న, నిర్వహించనున్నారు ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన అత్యవసర సమావేశానికి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్ మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ హాజరయ్యారు.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సంధర్బంగా ఈ భారీ విగ్రాహాన్ని ఆవిష్కరిస్తున్న శుభ సంధర్బంగా సాంస్కృతిక కార్యక్రమాల పూర్తి కీలక బాధ్యతలను కేసీఆర్ రసమయికి అప్పగించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలతో పాటు ఆయన జీవిత చరిత్రపై ప్రత్యేక కళా ప్రదర్శనలు ఇవ్వడానికి గాను కళాకారులతో రంగం సిద్ధం చేయడం జరిగిందని రసమయి కేసీఆర్ కి వివరించారు.