కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను ముచ్చటగా 3వ,సారి కేటాయించడంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మరియు రసమయి బాలకిషన్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు, రసమయి మళ్ళీ నువ్ భారీ మెజార్టీతో గెలువబోతున్నావు అంటూ బుజం తట్టి ఆశీర్వదించారు.