కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సోమవారం రాష్ట్ర సంస్కృతిక సారథి. శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలను గన్నేరువరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అఖండ విజయంతో గెలిచి మంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. అనంతరం మండలంలోని ఖాసీంపేట గ్రామంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
