హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు వంశీ ర్యాష్ డ్రైవింగ్, ఓ మహిళ ప్రాణాలు బలితీసుకుంది. నిన్న ఓటు వేసిన అనంతరం మహిళ భర్త బైకు ఎక్కుతుండగా మహిళను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చనిపోయిన మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. పోలీసులు పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు కాజీపేట పోలీస్ స్టేషన్ ముందు ఈరోజు ఆందోళనకు దిగినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.