- దాచేపల్లి గురజాల మండలాల పరిధిలో అడ్డగోలుగా రేషన్ బియ్యం మాఫియా
- ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అంతా మా ఇష్టం అంటున్న దళారి
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల దాచేపల్లి మండల పరిధిలో అక్రమ రేషన్ బియ్యం మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఏ పార్టీ వచ్చినా అంతా మా ఇష్టమే అంటూ రేషన్ మాఫియా దళారులు మాట్లాడుతున్నట్లు సమాచారం. మరి ఏ పార్టీ వచ్చిన అనేకంటే రేషన్ బియ్యాన్ని అడ్డగోలుగా కొనుగోలు చేసి అక్రమంగా అమ్ముతుంటే స్థానిక అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రజల ప్రశ్నిస్తున్నారు. దాచేపల్లి మండల కేంద్రంలో డంపు పెట్టి మరి ఏకదాటిగా రేషన్ బియ్యం తరలి వెళుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలు దారితీస్తుంది. ఈప్పటికైనా అక్రమ రేషన్ బియ్యానికి దాచేపల్లి మండల పరిధిలో అడ్డుకట్ట వేయాలని పేదవాడి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు .