contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Prakasham : భారీగా రేషన్ బియ్యం పట్టివేత

  • పి.డి.స్ బస్తాలుతో సహా పట్టుకున్న అధికారులు
  • రేషన్ షాపునుండి నేరుగా అక్రమార్కుడి ఇంటికి చేరిన బస్తాలు

 

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రావిపాడు రోడ్డులో గల మస్తాన్ వలి స్వామి దర్గా సమీపంలో మూడు అంతస్తుల ఒక భవనంలో భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయంటూ సమాచారం అందుకున్న కంభం గోడౌన్ డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ మరియు ఇన్ఫర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారి అనిల్ ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది కంభంలోని మూడంతస్తుల భవనంలో పిడిఎస్ బస్తాలతో సహా సుమారు 200 బస్తాలు ఉన్నాయంటూ సమాచారం తెలుసుకున్న ప్రసాద్ ఒక అశోక్ లేలాండ్ పెద్ద ఆటోను అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే ఇన్ని బస్తాలు ఒకేసారి పట్టు పడటంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అధికారులు వచ్చి ఇల్లు సోదలు చేస్తుండగా ఏమి జరుగుతుందో అనే అనుమానంతో అక్కడున్న స్థానిక ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి గుమ్మి కూడరు అక్కడున్న అధికారులకు ప్రజలు ఏం జరుగుతుందని అడిగి తెలుసుకోగా ఇక్కడ పేదలకు పంచిపెట్టే రేషన్ బియ్యం ఉందంటూ దాన్ని ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఆ ఫోన్ కాల్ ద్వారా మేము వచ్చి ఇంటిని సోదా చేయగా ఇక్కడ ఒక బొలెరో వాహనం ఉండడంతో అందులో పేదలకు పంచిపెట్టే రేషన్ బియ్యం ఆటో నిండా ఉండడంతో అధికారులు మరియు స్థానిక చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రజలు అవాక్కయ్యారు అలాగే అధికారులు ఇంటి కిందనున్న గోడౌన్ లాంటి ఆవరణలో రేషన్ బియ్యం వందలాది బస్తాలు ఉండడం మరియు పిడిఎస్ రేషన్ షాపు నుండి నేరుగా అక్రమార్కులు మిల్లులకు చేర్చేందుకు సిద్ధంగా ఉండడంతో గోడౌన్ డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అనిల్ కుమార్ పై అధికారులకు సమాచారం ఇచ్చి ఆ బస్తాలను మరియు అశోక్ లేలాండ్ ఆటో వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు సమాచారం అందుకున్న విలేకరులు అక్కడికి చేరుకొని డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ ను వివరణ కోరగా ఓ ఇంట్లో వందలాది రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయని ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో మేము ఆ స్థలానికి వచ్చి ఈ బస్తాలన్నీ స్వాధీనపరచుకొని గోడౌన్ కు తరలిస్తామని చెప్పి అలాగే అశోక్ లేలాండ్ ఆటో ను పోలీస్ స్టేషన్ కు తరలించి ఇవి ఎక్కడి నుంచి వచ్చినవి ఈ పి.డి.స్ బియ్యం ఏ షాపు నుండి వచ్చినవి అనేది విచారణ చేసి తదుపరి అధికారులకు సమాచారం ఇచ్చి వాటిపై కేసు నమోదు చేసి పై అధికారులు లతో విచారణ జరిపించి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ రు అనిల్ కుమార్ విలేకరులకు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :