కరీంనగర్ జిల్లా: రామడుగు మండల పోలీస్ స్టేషన్లోఎస్సైగా మామిడాల సురేందర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ శుభ సందర్భంగా ఉమ్మడి జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు, ఎస్సై మామిడాల సురేందర్ ను కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ అభినందనలు తెలియజేశారు. ఎస్సై కి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామడుగు రెండో ఎంపీటీసీ సభ్యులు బొమ్మరవేణి తిరుపతి, బాసవేణి శ్రీనివాస్,బాసవేణి తేజ,గంటె సుమన్ తదితరులు పాల్గొన్నారు.
