కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ రామోజీ రజిత కృష్ణమాచారి, మరియు డైరెక్టర్ కొత్త కైలాసము లకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో ఘనంగా సన్మానించారు. బిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సన్మాన సభకు స్థానిక జెడ్పిటిసి సభ్యులు గీకురు రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అధిష్టానం గుర్తింపు నిస్తుందన్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గంలో మండలానికి చెందిన ఇద్దరు కూడా పార్టీ కోసం పని చేసిన వారేనని, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం పట్ల గౌరవ శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకులు చేసే పస లేని విమర్శలను పట్టించుకోవద్దన్నారు. గతంలో 2014 ముందు ఈ ప్రాంతం మెట్ట ప్రాంతమని, బీళ్లు బారిన పొలాలన్నీ నేడు పచ్చటి పైర్లతో కళకళలాడుతున్నాయన్నారు. విమర్శించే ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ కళ్ళకు చత్వారాలు వస్తే కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకొని,అద్దాలు పెట్టుకొని చూడాలన్నారు. ఒక చిగురుమామిడి మండలంలోనే 2014లో ఒక పసల్ కు 40 నుంచి 50 వేల క్వింటాళ్లు వరి పండిస్తే, మొన్న ఖరీఫ్ సీజన్లో 2.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండిందన్నారు. రైతాంగ అభివృద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పన్యాల శ్యామసుందర్ రెడ్డి, సింగిల్ విండోచైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంకు శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు రామోజీ కృష్ణమాచారి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బెజ్జంకి అంజయ్య, సుందరగిరి దేవస్థానం చైర్మన్ తాళ్లపల్లి సంపత్, సింగిల్ విండో డైరెక్టర్ తాళ్ల పెళ్లి తిరుపతి దేవస్థానం డైరెక్టర్ రామోజీ రాజకుమార్, దిలీప్ కుమార్, విష్ణుమాచారి, మండల మహిళా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి అరుణ, దేశిని రాజయ్య, జక్కుల బాబు, చీకుట్ల సదయ్య, పెసరి శ్రీనివాస్, దాసరి సాంబయ్య, బోయిని సది, పింగిళి రాజిరెడ్డి దొబ్బల బాబు, తుంగ సది, పిల్లి తిరుపతి, కత్తుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
