ఇన్ ఫ్రా నిర్మాణ రంగంలో నాణ్యతా ప్రమాణాలతో పాటు ఇచ్ఛిన గడువులోగా పూర్తి చేయడంలో పెరుగాన్ఛిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ పై బురదజల్లబోయి తాను తీసిన గోతిలో తానే కూరుకుపోయాడు tv9 మాజీ సిఈవో రవి ప్రకాష్. మేఘా సంస్థ తానే – బోరెవెళ్లి ప్రాజెక్టులో బ్యాంకు గ్యారంటీ ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడిందని బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. దీనిపై మేఘా సంస్థ ఇంటర్మ్ అప్లికేషన్ దాఖలు చేసింది. అందులో రవి ప్రకాష్ పై గతంలో నమోదైన కేసులు, అరెస్ట్ అయ్యి విడుదలవ్వడం, ఆయన చేసిన అక్రమాలు, నియమనిబంధనలకు విరుద్ధంగా పాత్రికేయ విలువలను పాతరేసి జుగుప్సకరమైన పద్ధతిలో బురద జల్లే ప్రయాత్నాలను తన అప్లికేషన్ లో సోదాహరంగా వివరించింది.
అసలు ఆయన నాలుగు నెలల క్రితం దాఖలు చేసిన పిటీషన్ కోర్టు విచారణకు రాలేదు. హైకోర్టు పిటిషన్ పై చాలా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాలకు ఇప్పటికీ రవిప్రకాష్ సమాధానం ఇచ్చుకోలేదు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాది కేసును విచారించాలంటూ బెంచ్ ముందు ఇటీవలనే మెన్షన్ చేశారు. దాంతో ఈ రోజు కేసును పిల్ నెంబర్ ఇవ్వకుండానే ఎస్.ఆర్ నెంబర్ ఆధారంగా పిల్ నెంబర్ ఇవ్వాలా లేదా అనేదానిపై విచారించింది. ఈ కేసులు పిటీషనర్ తరపున ప్రశాంత్ భూషన్, ప్రభుత్వం సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మేఘా ఇంజనీరింగ్ తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో మేఘా దాఖలు చేసిన (3వ రెస్పాండెంట్) ఐఏ చర్చకు వచ్చింది. దానిపై కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషనర్ కౌన్సిల్ సమయంలో కోరడంతో మార్చి 5వ తేదికి వాయిదా వేశారు. ఐఏ లోని అంశాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. అవి ఏంటంటే …
1) TV 9 ( ABCL private Limited ) లో సీ.ఈ.వో గా ఉన్నప్పుడు డబ్బులు పక్కదారి పట్టిస్తూ, యాజమన్య హక్కులని అక్రమంగా పొందాలని చూసిన రవి ప్రకాశ్ కి 2022 లో NCLT ( National Company Law Tribunal) హైదరబాద్ – చెంపదెబ్బ లాంటి తీర్పుని ఇచ్చింది. ఇందులో మేజర్ వాటాదారులు మాత్రమే యాజమాన్య హక్కులు పొందుతారని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా కోర్టు యొక్క విలువైన సమాధానాన్ని వృథా చేసినందుకు 10 లక్షల జరిమానా రవి ప్రకాశ్ కి విధించింది.
2) NCLT – హైదరాబాద్, ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ రవి ప్రకాశ్ చెన్నై అప్పిలేట్ ట్రిబ్యునల్ వ్యాజ్యం దాఖలు చేయగా, అక్కడ కూడా అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా కోర్ట్ వ్యాఖ్యానిస్తూ ” లాభాపేక్ష తో నే ఈ పిటీషన్ దాఖలు చేశారని ” అభిప్రాయపడింది.
3) రవి ప్రకాశ్ తన రాజ్ న్యూస్, తొలివెలుగు, ఆర్. టివి ద్వారా మేఘా కంపెనీ పై మరియు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పై ఏకధాటిగా 380 నెగెటివ్ కథనాలు ప్రసారం చేసినందుకు కూకట్ పల్లి కోర్ట్ “అసభ్య , అసంబద్ధ కథనాలని వెబ్సైట్ మరియు మీడియా చానెల్స్ నుండి తీసివేయాలి” అని కూకట్ పల్లి కోర్ట్ ఆదేశాలు రవి ప్రకాశ్ కి 2022 లో జారీ చేసింది.
4) అధే విధంగా, మరి కొన్ని కథనాలని తీసివేయాల్సిందిగా ఖమ్మం డిస్ట్రిక్ట్ జడ్జ్ కూడా రవి ప్రకాశ్ ని ఆదేశించారు.
5) 2023 లో కూకట్ పల్లి సివిల్ కోర్ట్ కూడా తీవ్ర స్థాయిలో మళ్ళీ హెచ్చరించింది.
6) రవి ప్రకాశ్ పై 2019 లో సెక్షన్ .66 ( ఐ.టి. చట్టం ) కింద కూడా సైబర్ కేసు హైదరబాద్ పోలిసులు నమోదు చేశారు.
7) 2020 లో అక్రమ సంపాదన మరియు మనీ లాండరింగ్ విషయం లో ఎన్ ఫొర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈ.డి) రవి ప్రకాశ్ పై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం కేసు ఇంకా కొనసాగుతోంది.
8) 2022 లో మేఘా కంపెనీ డైరెక్టర్ పై వ్యక్తిగత , జుగుప్త్సాకరమైన ఆరోపణలతో కథనాలు ప్రసారం చేసినందుకు బాలా నగర్ ( హైదరబాద్) పోలిస్ స్టేషన్ లో 14 సెక్షన్ల కింద ఇతని పై కేసులు నమోదు చేశారు
9) డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ని ఉల్లంఘించినందుకు , సమాచార & బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఇతని పై చర్యలు తీసుకుంది.
10) ఇతని యొక్క బ్లాక్మయిలింగ్ ధోరణులు మరియు ఆర్థిక చట్టాల ఉల్లంఘన పై ఢిల్లి హై కోర్ట్ లో వ్యాజ్యం దాఖలు అయ్యింది.
11) తన ట్విట్టర్ ఖాతాలో , బాంబే న్యాయమూర్తులని పరోక్షంగా బెదిరించిన ధోరణి పై కూడా వచ్చే మార్చ్ 5 న డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.
12). ఈ కేసుల వివరాలనంటిని ఉద్దేష్య పూర్వకంగా బాంబే హై కోర్ట్ కి చెప్పకుండా , కోర్ట్ ని తప్పుదోవ పట్టిస్తుండటం కొసమెరుపు. ఈ విషయాలన్ని పరిగణ లోకి తీసుకొనే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్త , రవి ప్రకాశ్ కోర్ట్ ధిక్కార చర్యలకి పాల్పడుతున్నడు అని న్యాయమూర్తికి విన్నవించుకున్నారు.