- నెల రోజులుగా అట్టహాసంగా సాగిన అమ్మవారి ఉత్సవాలు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజవర్గం ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో గ్రామ దేవత అయిన రావులమ్మ జాతర మహోత్సవాలు గత నెల రోజుల నుండి అట్టహాసంగా జరిగాయి. పూర్వీకుల నుండి వచ్చిన సంప్రదాయం ప్రకారం గ్రామ వంశస్థులు కొన్ని తరాల నుండి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. అదే ఆనవాయితీని గ్రామ ప్రజలు నేటికీ కొనసాగిస్తున్నారు. నెల రోజుల నుండి సోమవారం జరిగే జాతర మహోత్సవాలు వరకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇంటి పేరుతో ప్రతిరోజు జాతర ఉత్సవాలు జరిపించడం జరిగింది. జాతర మహోత్సవాల్లో గరగ నృత్యలు, గారడీలు, డిజె సాంగ్ లతో, తీన్మార్ సంబరాలతో అంబరాన్ని తలపించేలాగా సందిపూడి రావులమ్మ ఉత్సవాలు ఊరి గ్రామస్తులు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో నేడు జరగబోయే చివరి ఉత్సవంలో భాగంగా అమ్మవారికి పూర్ణం బూరెలు ప్రతి గడప నుండి మహిళలు సంప్రదాయం ప్రకారం నైవేద్యం రూపంలో అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు.అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి నైవేద్యం ఇచ్చిన బూరెలను అన్నదాన కార్యక్రమంలో వడ్డిస్తారు.