Andhrapradesh: అన్నమయ్య జిల్లా రాయచోటి : రాయచోటి పట్టణంలో హిందూ దేవాలయాన్ని దర్గా గా మార్చే కుట్ర జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే పీలేరు రింగ్ రోడ్డు , మదన పల్లి రింగ్ రోడ్డు దగ్గర రాజధాని ఫంక్షన్ హాల్ పక్కన సుద్దాలపల్లి రోడ్డులో ఉన్న బోయ గంగమ్మ తల్లి దేవాలయాన్ని కొందరు ముస్లిం యువకులు ఆక్రమించి దర్గా గా మార్చే ప్రయత్నం చేయడం చుసిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు. ముస్లిం వర్గానికి చెందిన ముగ్గురు యువకులు గంగమ్మ తల్లి దేవాలయం వద్ద కాళ్ళు కడుక్కుని ముస్లిం మతానికి సంబంధించిన జండాని ఆవిష్కరించి వెళ్లారు. అంతేకాక అక్కడున్న హిందూ దేవుళ్ళ ఫోటోలను తొలగించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం బాధాకరం. త్వరలో హిందూ దేవాలయం మసీదుగా పిలవబడబోతుంది. స్థానిక ఎమ్మెల్యే కి గాని , అధికారులకు గాని ఫిర్యాదు చేయేయాలంటే స్థానికులు భయపడుతున్నారు. ఎందుకంటే ఇంత ధైర్యంగా హిందూ దేవాలయాన్ని తొలగించి దర్గా గా మార్చారంటే అధికార పార్టీ అందండలు ఉండి ఉండొచ్చని ఆరోపణలు విన వస్తున్నాయి. ఇకనైనా ఉన్నతధికారులు స్పందించి ఇటువంటి చర్యకు పాలుపడిన ముస్లిం యువకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.